: చావెజ్ మరణానికి గుండె పోటే కారణం: భద్రతాధికారి వెల్లడి


తీవ్ర స్థాయిలో గుండె పోటు రావడంతోనే వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మరణించారని ఆయన వ్యక్తిగత భద్రతాధికారి జనరల్ హోసె ఒర్నెల్లా వెల్లడించారు. అయితే, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ముదరడంతో చావెజ్ కన్నుమూశారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, మరణానికి కొద్ది ముందు చావెజ్ తనకు బతకాలని ఉందని చెప్పినట్లు ఓర్నెల్లా తెలిపారు. చావెజ్ కు క్యాన్సర్ ఉన్నట్టు తెలిసినప్పటి నుంచి ఆయనను అంటిపెట్టుకునే ఉన్నానని ఓర్నెల్లా చెప్పారు. చావెజ్ పార్థివ దేహాన్నిదేశ వాసుల సందర్శనార్థం మిలిటరీ అకాడమీ వద్ద ఉంచిన సమయంలో ఓర్నెల్లా ప్రసార మాధ్యమాలతో మాట్లాడారు. 

  • Loading...

More Telugu News