: ఆరు రోజుల పసికందును గొంతు పిసికి చంపిన తల్లి
హైదరాబాద్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ చిలకలగూడలో ఓ బాలింతకు ఎయిడ్స్ సోకింది. అయినా ఆమె ఆరు రోజుల క్రితం పండంటి బిడ్డుకు జన్మనిచ్చింది. అయితే తనకు పుట్టిన కుమార్తెకు కూడా ఎయిడ్స్ సోకి ఉంటుందనే అనుమానంతో ఆ పసికందు గొంతు పిసికేసింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి పసిపాపను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పాప మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో జరిగిన విషయంపై వైద్యులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు పసికందు తల్లిని అదుపులోకి తీసుకున్నారు.