: తీరం దాటిన వాయుగుండం


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడులోని నాగపట్నం వద్ద తీరం దాటినట్టు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయుగుండం ప్రస్తుతానికి నాగపట్నానికి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. అల్పపీడనంగా బలహీన పడుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర సముద్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News