: మరి కొద్దిసేపట్లో మంత్రివర్గ సమావేశం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపట్లో మొదలవనుంది. దాదాపు మూడు నెలల అనంతరం మంత్రివర్గ సమావేశాన్నినిర్వహిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ప్రధానంగా విద్యుత్ సమస్య, తాగునీటి అంశం, బాంబు పేలుళ్ల ఘటనలు, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలపై చర్చిస్తారు.

ఇక, ఈ నెల 13 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఎమ్మార్ కేసులో రాజీనామా చేసినా, రెండు వారాల నుంచి విధులకు హాజరవుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News