: సచిన్ కు 'భారతరత్న' సముచితం: రాజీవ్ శుక్లా
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు కేంద్ర ప్రభుత్వం 'భారతరత్న' పురస్కారం ప్రకటించడం క్రీడా ప్రపంచానికి ఆనందం కలిగించిందని బీసీసీఐ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శుక్లా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సచిన్ ను గౌరవించడానికి 'భారతరత్న' సముచిత పురస్కారం అని అన్నారు. సచిన్ సాధించిన రికార్డులను తిరగరాయడం ఇప్పట్లో జరిగే పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సచిన్ నుంచి ప్రజలు ఎప్పుడూ స్ఫూర్తి పొందుతారని రాజీవ్ శుక్లా అన్నారు.