: సచిన్ కు 'భారతరత్న' ప్రకటించిన ప్రభుత్వం
క్రికెట్ దేవుడు సచిన్ కు భారత ప్రభుత్వం అత్యున్నతమైన 'భారతరత్న' పౌరపురస్కారం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఇప్పుడే ప్రకటన వెలువడింది. 24 ఏళ్లపాటు క్రికెటర్ గా ఎనలేని సేవలందించి... భారతదేశ పేరుప్రఖ్యాతులను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన సచిన్ ను భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సమున్నత రీతిలో గౌరవించింది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అంతులేని బాధతో క్రీడామైదానాన్ని వీడిన సచిన్ కు... ఒక కానుకలా కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఈ నేపథ్యంలో, క్రీడారంగం నుంచి భారతరత్నకు ఎంపికైన ఏకైక వ్యక్తిగా సచిన్ చరిత్రకెక్కారు. దీనికితోడు, ఇప్పటిదాకా భారతరత్న పొందిన వ్యక్తుల్లో పిన్న వయస్కుడిగా కూడా సచిన్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.