: తప్పుడు సమాచారం వల్లే విభజన ప్రక్రియ మొదలైంది : కావూరి
కేంద్రానికి తప్పుడు సమాచారం పంపించడం వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఈ రోజు ఆయన మూడున్నర కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న పట్టుగూళ్ల పరిశ్రమ కేంద్రం నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో విభజన అనివార్యంగా కనిపిస్తోందని తెలిపారు. మెజారిటీ ప్రజలు హైదరాబాద్ ను యూటీ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు.