: నంబర్ 1 నుంచి 10 వరకూ టార్గెట్ మోడీయే!
ఉగ్రవాదులు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకున్నారని లోగడే వెల్లడైనా.. ఆ లక్ష్యం చాలా బలమైనదని ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేత యాసిన్ భత్కల్ మాటలను బట్టి తెలుస్తోంది. పాట్నా, గయ పేలుళ్ల కేసును దర్యాప్తు చేస్తున్న బీహార్ పోలీసులకు విచారణలో భత్కల్ కీలక విషయాలు వెల్లడించాడు. ఉగ్రవాద సంస్థలకు మోడీ మొదటి టార్గెట్ అని భత్కల్ చెప్పాడు. అంతేకాదు నంబర్ 2, 3, 4 ఇలా 10 వరకూ మోడీయే లక్ష్యమని చెప్పడాన్ని చూస్తే మోడీని అంతమొందించేందుకు ఉగ్రవాద సంస్థలు ఎంతగా కాచుక్కూర్చున్నాయో తెలుస్తోంది.