: జట్టులోకి తిరిగొస్తా: సెహ్వాగ్
ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు భారత జట్టులో స్థానం కోల్పోయిన ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పునర్ వైభవం సాధిస్తానంటున్నాడు. ఇప్పుడప్పుడే క్రికెట్ కు వీడ్కోలు పలకనని చెబుతూ, జట్టులోకి తిరిగొస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
వేటు పడినంతనే తన కెరీర్ ముగిసినట్టు కాదని సెహ్వాగ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. సెహ్వాగ్ తన చివరి 9 ఇన్నింగ్స్ ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. అంతేగాకుండా విదేశీ గడ్డపై గత 6 టెస్టుల్లో కేవలం 20 సగటు నమోదు చేశాడు.