: దిగ్విజయంగా మామ్ కక్ష్య పొడిగింపు
అంగారక గ్రహంపైకి భారత్ పంపిన మామ్ ఉపగ్రహ కక్ష్య పొడిగింపు చివరిగా ఐదోసారి దిగ్విజయంగా పూర్తయింది. ఈ కార్యక్రమంతో ఉప్రగ్రహం అపోజీని(భూమి నుంచి అత్యంత దూరం) 1,18,642 కిలో మీటర్ల దూరం నుంచి 1,19,874 కిలో మీటర్ల వరకు పొడిగించామని ఇస్రో వెల్లడించింది. ఈ రోజు ఉదయం 1.47 నిమిషాలకు ప్రారంభమై 243.5 సెకన్ల బర్న్ టైంలో కక్ష్య పొడిగింపు విజయవంతంగా పూర్తిచేశామని ఇస్రో తెలిపింది.