: అగ్నిప్రమాద హెచ్చరికతో వెనుదిరిగిన ఫ్లయిట్


ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరిన గో ఎయిర్ విమానం గమ్యాన్ని చేరకుండానే అర్ధంతరంగా వెనుదిరిగింది. ఉదయం 8 గంటలకు ఢిల్లీలో బయల్దేరిన విమానం 40 నిమిషాల ప్రయాణం తర్వాత అగ్నిప్రమాద హెచ్చరిక రావడంతో పైలట్ వెనక్కు తిప్పి ఢిల్లీ విమానాశ్రయంలో దింపేశాడు. ఈ విమానంలో ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ కూడా ఉన్నారు. తన జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన ముంబైలో ఈ రోజు సాయంత్రం ఆవిష్కరించాల్సి ఉంది. ఈ పుస్తక సహ రచయిత కునాల్ వర్మతో కలిసి సింగ్ ముంబై వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News