: ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ నా ఫ్యామిలీ మెంబర్స్: సచిన్
భారత క్రికెట్ లో తన సమకాలీనులైన సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తన కుటుంబ సభ్యులని, తాను విలువైన సమయాన్ని వారితోనే గడిపానని, వారితో పంచుకున్న క్షణాలు మధురమైనవని సచిన్ తెలిపారు. తనకు మంచి అనుభూతులు నిలిపినందుకు సచిన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. తనతో డ్రెస్సింగ్ రూం పంచుకున్న ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని, అయితే తాను మాత్రం ఇకపై డ్రెస్సింగ్ రూం మిస్సవుతానని సచిన్ తెలిపారు.