: వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ ఇస్తాం: తెరాస ఎమ్మెల్యేలకు ట్రాన్స్ కో సీఎండీ హామీ
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొని ఉన్నా, వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్ కో సీఎండీ హామీ ఇచ్చారు. ఈమేరకు తెరాస ఎమ్మెల్యేలకు ట్రాన్స్ కో సీఎండీ లిఖిత పూర్వకంగా హామీ పత్రం ఇచ్చారు.
పైగా, తెలంగాణ ప్రాంతంలోని ఫీడర్లకు అదనంగా వంద మెగావాట్ల విద్యుత్ కేటాయిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. అంతకుముందు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా విషయంలో తెరాస ఎమ్మెల్యేలకు ట్రాన్స్ కో సీఎండీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు సమాచారం.