: కన్నీళ్లు పెట్టుకున్న సచిన్
భారత జట్టు ఘన విజయం సాధించింది. సచిన్ చివరి మ్యాచ్ ను భారత్ అద్భుతంగా ముగించింది. ఆట ముగిసిన వెంటనే సచిన్ ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. బరువైన హృదయంతో కదిలాడు. తన సహచరులందరినీ కౌగిలించుకున్నాడు. చివరి మ్యాచ్ గుర్తుగా వికెట్ ను చేతబట్టి పెవిలియన్ వైపు తరలిపోయాడు. సచిన్ కు గౌరవసూచకంగా భారత ఆటగాళ్లు సచిన్ కు ఇరువైపులా నిలబడ్డారు. విండీస్ ఆటగాళ్లు క్రికెట్ యోధుడితో చివరిసారిగా కరచాలనం చేశారు.