: భారత్ ఘన విజయం..
భారత జట్టు సచిన్ కు ఘనంగా వీడ్కోలు చెప్పింది. రెండు టెస్టుల సిరీస్ లో ఇన్నింగ్స్ తేడాతో భారత జట్టు వెస్టిండీస్ ను ఓడించి సిరీస్ సొంతం చేసుకుంది. విండీస్ బౌలర్లు ప్రభావం చూపలేని పిచ్ పై భారత స్పిన్నర్లు దుమ్ముదులిపారు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి విండీస్ నడ్డి విరిచిన ఓజా, మరోసారి ఐదు వికెట్లు సాధించి తన మాయాజాలాన్ని విండీస్ కు రుచి చూపించాడు. దీంతో ఓజా ఒకే టెస్టులో పది వికెట్లు సాధించిన బౌలర్ల సరసన చేరాడు. ఓజా, అశ్విన్ ల ధాటికి రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాట్స్ మన్ చేతులెత్తేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 182 పరుగులకే ఆలౌటైన విండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 187 పరుగులకు పెవిలియన్ చేరింది. దీంతో ఇన్నింగ్స్ 126 పరుగులతో ఘోర పరాజయం చవిచూసింది.