: క్రికెట్ లేని సచిన్ ను ఊహించలేను: అంజలి
తన భర్త సచిన్ టెండుల్కర్ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తుండడంపై అంజలి స్పందించింది. క్రికెట్ లేని సచిన్ ను ఊహించలేకపోతున్నానని, సచిన్ కు క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలియదని ఆమె తెలిపారు. వాంఖడే స్టేడియంలో ఆటను వీక్షిస్తూ అంజలి మీడియాతో మాట్లాడారు. సచిన్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ఇంటిదగ్గర పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. క్రికెట్ ను ఆరాధించిన సచిన్ ఇకపై ఆడడంటే అతనితోపాటు కుటుంబం మొత్తానికీ ఉద్వేగంగానే ఉంటుందన్నారు. సచిన్ లేని క్రికెట్ ను ఊహించగలనేమో కానీ, క్రికెట్ లేని సచిన్ ను ఊహించలేనని చెప్పారు.