: ఆశ్రమంలో కామాంధులు.. విద్యార్థినిపై అత్యాచారయత్నం


ఆధ్యాత్మికతతో, ధ్యానంతో వర్ధిల్లాల్సిన ఆశ్రమాలు కామాసురులకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఆశారాం బాపు, నిత్యానంద ఇలా ఎంతో మంది స్వాములు ఆశ్రమాలలో సాగించిన లైంగిక దాడులపై కేసులు నమోదై ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ఆశ్రమంలో సేవకులు కూడా స్వాముల బాటలోనే మేమూ అంటూ లైంగికదాడికి యత్నించారు. ఈ నెల 3న స్వామి చంద్రమోహన్ దర్శనం కోసం పరమాధమ్ ఆశ్రమానికి కాలేజీ విద్యార్థిని వెళ్లింది. నాలుగు రోజులు ఆశ్రమంలోనే ఉండి స్వామి సేవ చేసుకోవాలని సేవకులు సూచించారు. అనంతరం కొంతమంది ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేయడంతో భక్తులు కాపాడారు. దీంతో ఆశ్రమ ఇన్చార్జి సహా మొత్తం తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News