: సీపీఐ నేత సురవరంతో భేటీ అయిన జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ సీపీఐ నేత సురవరం సుధాకరరెడ్డితో ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పలు జాతీయ పార్టీల నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టడానికి... వైసీపీ అధినేత ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ మొదట సురవరంను కలిశారు. జగన్ తో పాటు ఎంపీ మేకపాటి, కొణతాల, బాలశౌరి, గట్టు రామచంద్రరావు, మైసూరారెడ్డి తదితరులు ఉన్నారు.