: ప్రకాశం జిల్లాకు టెక్స్ టైల్ పార్కు మంజూరు: కేంద్ర మంత్రి పనబాక


కేంద్రం ఇటీవల ప్రకటించిన తాజా బడ్జెట్ హామీల్లో భాగంగా ప్రకాశం జిల్లాకు టెక్స్ టైల్ పార్కు మంజూరు అయిందని కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. అలాగే గుంటూరు, ప్రకాశం జిల్లాలను కలుపుతూ ఓ మెగా క్లస్టర్ కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ క్లస్టర్ కు రూ. 70 కోట్లు ఖర్చవుతుందని ఆమె వెల్లడించారు.

అర్హులైన చేనేత కార్మికులకు రుణ మాఫీ పథకం అందుబాటులోకి తెచ్చేలా బ్యాంకు అధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇక ఆధార్ విషయంలో ఎలాంటి సందేహాలొద్దని చెప్పారు. ప్రస్తుతం ఐదు జిల్లాల్లోనే ఆధార్ తో గ్యాస్ ను అనుసంధానం చేశామని, ప్రజలందరూ వేగిరమే ఆధార్ కార్డులు పొందాలని పనబాక సూచించారు. 

  • Loading...

More Telugu News