: సాయంత్రానికి తీరం దాటనున్న వాయుగుండం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 15 కిలోమీటర్ల దూరంలో పయనిస్తోంది. ఇది చెన్నైకి 310 కిలోమీటర్లు, నాగపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయుగుండం ఈ సాయంత్రానికి నాగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. దీంతో, రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు.