: ఓఎంసీ ఆస్తుల అటాచ్ మెంట్ కేసు తీర్పు వాయిదా
ఓఎంసీ ఆస్తుల అటాచ్ మెంట్ కేసు తీర్పును ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు ముగిసిన అనంతరం న్యాయ ప్రాధికార సంస్థ తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్టు తెలిపింది. కాగా, బ్రహ్మణి ఇండస్ట్రీస్ ఆస్తుల అటాచ్ మెంట్ వ్యవహారంలో ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని ఈడీ పేర్కొంది. కంపెనీ చట్టాలకు లోబడే చర్యలు తీసుకున్నామని తన వాదనల్లో వివరించింది. అయితే, ఈడీ తన వాదనలను లిఖిత పూర్వకంగా సమర్పించాలని ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ సూచించింది.