: లెనోవో కొత్త ట్యాబెట్లు వస్తున్నాయి
పర్సనల్ కంప్యూటర్లను తయారు చేసే లెనోవో కంపెనీ ఇప్పుడు కొత్త యోగా ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేస్తుంది. 8, 10 అంగుళాల డిస్ప్లేతో కూడిన సైజుల్లో కనిపించే ఈ ట్యాబ్లెట్ల ధర 8 అంగుళాలది రూ.22,999గానూ, 10 అంగుళాల ట్యాబ్లెట్ ధర రూ.28,999 గాను కంపెనీ నిర్ణయించింది. ఈ యోగా ట్యాబ్లెట్లతో తామందిస్తున్న ట్యాబ్లెట్ల సంఖ్య 6కు పెరిగిందని లెనోవో ఇండియా డైరెక్టర్ (కన్సూమర్ బిజినెస్) శైలేంద్ర కత్యాల్ తెలిపారు.
ఈ ట్యాబ్లెట్లు మైక్రోసిమ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇవి క్వాడ్‌కోర్ 1.2 గిగా హెర్ట్జ్ మీడియా టెక్ కోర్టెక్స్`ఏ7 ప్రాసెసర్, 5 మెగా పిక్సెల్ కెమెరా, 1.6 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలను కలిగివున్నాయి. ట్యాబ్లెట్ 8లో వాయిస్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది.