: కోట్లు పలికిన ఈ చిత్రం గొప్పదనం ఏంటో...?
ఒక చిత్రం వేలంలో కోట్లకు అమ్ముడుపోయింది. అంత గొప్పదనం ఏముంది? ఆ చిత్రంలో అనుకుంటున్నారా... అది ఒక కారు ప్రమాదానికి సంబంధించిన చిత్రం. ఒక కారు ప్రమాదానికి గురై నుజ్జు నుజ్జు అయితే అందులో ప్రయాణిస్తున్న వారు ఏ విధంగా ప్రమాదానికి గురై వుంటారో అనే విషయాన్ని చిత్రకారుడు చక్కగా చిత్రించాడు. ఈ చిత్రాన్ని వేలం వేస్తే... వందలకోట్లు పెట్టి కొనుక్కున్నారు కళాభిమానులు.
న్యూయార్క్‌లో సోథెబీ సంస్థ నిర్వహించిన వేలంలో ఒక కారు ప్రమాదానికి సంబంధించిన చిత్రం దాదాపు 666.71 కోట్లకు అమ్ముడుపోయింది. ఇంత ప్రాధాన్యత ఈ చిత్రంలో ఏముంది? అనుకుంటే అది ఒక కారు ప్రమాదానికి సంబంధించిన చిత్రం. ఇందులో ప్రమాదానికి గురైన కారు, అందులో ప్రయాణిస్తున్న వారు మరణిస్తే, నలిగిన వారి అవయవాలు, కారు భాగాలు అన్ని చక్కగా చిత్రించాడు చిత్రకారుడు. ఆండీ వార్‌హోల్ అనే చిత్రకారుడు 1963లో వేసిన ఈ చిత్రంలో ఒక కారు ప్రమాదానికి గురైతే ఎంత భయానకంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. దీన్ని చిత్రించడంలో సిల్క్ స్క్రీన్ ఇంకును, సిల్వర్ స్ప్రే పెయింట్‌ను ఉపయోగించారు. ఆండీ వేసిన పెయింటింగ్స్ అన్నింటిలోకి ఇదే ఎక్కువ ధర పలికిందని సోథెబీ సంస్థ చెబుతోంది.