: కర్ణాటక బస్సు ప్రమాద మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు ఐదుగురు


నిన్న (గురువారం) కర్ణాటక హవేరి జిల్లాలోని కునుమళ్లహళ్లి వద్ద నేషనల్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీరిని ముంబైకి చెందిన దంపతులు కలీమ్ ఖాన్(40), సమీరాబాను (32), వారి ముగ్గురు పిల్లలు అమన్, కైఫ్, నుమాన్ గా గుర్తించారు. ఈ ఐదుగురు బస్సు మంటలు అంటుకున్న ప్రాంతంలో కూర్చోవడంతో ప్రమాదం నుంచి బయటపడలేక ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మిగిలిన ఇద్దరు సూరత్ కు చెందిన హేమంత్ కుమార్, బస్సు డ్రైవర్ నియాజ్ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News