: కామన్వెల్త్ సమావేశాలను శిక్షా వేదికగా మార్చరాదు : మహీంద్ర రాజపక్సే


కామన్వెల్త్ దేశాల సమావేశాలను శిక్షా వేదికగా మార్చకూడదని శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే అన్నారు. ఈ రోజు కామన్వెల్త్ దేశాధినేతల సమావేశాలు శ్రీలంకలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజపక్సే మాట్లాడుతూ... శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం లేదని తెలిపారు. దాదాపు 30 ఏళ్ల తీవ్రవాదం అంతమైన తర్వాత... ఇప్పుడు ఇక్కడంతా ప్రశాంతంగా ఉందని అన్నారు. గత నాలుగేళ్ల నుంచి శ్రీలంకలో ఒక్క తీవ్రవాద ఘటన కూడా చోటుచేసుకోలేదని చెప్పారు. ఇక్కడ ప్రతి మనిషికి బతికే హక్కు ఉందని తెలిపారు.

తమిళులపై ఊచకోత విషయంలో శ్రీలంక ప్రభుత్వం, వ్యక్తిగతంగా రాజపక్సే అంతర్జాతీయంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. శ్రీలంకలో మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోందనే నెపంతో కెనడా, మారిషస్ దేశాధినేతలు ఈ సమావేశాలకు హాజరుకాలేదు. తమిళ రాజకీయ పార్టీలకు తలొగ్గిన భారత ప్రధాని మన్మోహన్ కూడా శ్రీలంక పర్యటనను రద్దుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమపై పడ్డ మచ్చను సాధ్యమైనంత మేరకు తొలగించుకోవడానికి రాజపక్సే ప్రయత్నించారు.

  • Loading...

More Telugu News