: ఏఏపీ ఎన్నికల అభ్యర్ధుల్లో తొమ్మిది మంది కోటీశ్వరులు


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ పార్టీ ఎన్నికల్లో పోటీచేసే 18 మంది పేర్లతో తొలి జాబితాను ప్రకటించింది. అయితే, వారిలో తొమ్మిది మంది కోటీశ్వరులు ఉన్నారట. ఈ వివరాలను ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ తన వెబ్ సైట్ లో పెట్టింది. వాటిలో ఆభరణాలు, నగదు, మోటార్ వాహనాలతో పాటు, స్థిరాస్తులు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఆ తొమ్మిది మందిలో మాజీ మీడియా వ్యక్తి షాజియా ఇల్మీ కూడా ఉన్నారు. ఆయనే అత్యధికంగా ఆస్తులు కలిగి ఉన్నారు.

  • Loading...

More Telugu News