: 'ఒకే సంతానం' పాలసీకి మంగళం పాడనున్న చైనా
గత మూడు దశాబ్దాలుగా నిర్బంధంగా అమలవుతున్న ఒకే సంతానం పాలసీకి మంగళం పాడాలని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించేవారు కేవలం ఒక బిడ్డనే కనాలని ముప్పై ఏళ్ల క్రితం చైనాలో ఆర్డర్స్ పాస్ చేశారు. అదే గ్రామీణ ప్రాంతాల్లోనయితే... మొదటి సంతానం అమ్మాయి అయితే రెండో సంతానానికి అవకాశం కల్పిస్తారు. ఇప్పుడు ఈ చట్టాన్ని ఎత్తేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. అర్బన్ ఏరియాల్లో ఉండే దంపతుల్లో ఏ ఒక్కరైనా వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానమైతే... వారికి మరో బిడ్డను కనే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను అధికారిక జిన్హువా పత్రిక వెల్లడించింది.