: రచయిత కుష్వంత్ సింగ్ కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
ప్రఖ్యాత భారతీయ రచయిత కుష్వంత్ సింగ్ (98) కు ముంబయిలో నిర్వహిస్తున్న 'లిట్ ఫెస్ట్-2013'లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును బహూకరించారు. దాన్ని ఆయన సన్నిహితుడు స్వీకరించారు. భారతీయ సాహిత్యానికి ఎనలేని సేవచేసిన కుష్వంత్ కు అవార్డు కింద రూ.5 లక్షల నగదును అందించారు.