: యూపీ బీజేపీ ఎమ్మెల్యేకు బెయిల్
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాణాకు బెయిల్ మంజూరైంది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో చోటు చేసుకున్న అల్లర్ల కేసులో రెండు నెలల కిందట అరెస్టైన రాణా ఇప్పటి వరకు రిమాండ్ లో ఉన్నారు. కాగా, ఈ రోజు ముజఫర్ నగర్ లోని జిల్లా సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. లక్ష రూపాయల విలువైన రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది.