: ఈ నెల 17న రైల్వే టికెట్ బుకింగ్ నిలిపివేత
ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రైల్వే టికెట్ రిజర్వేషన్ నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే శిక్షణలో భాగంగానే రైల్వే బుకింగ్, విచారణ సేవలు నిలిపి వేస్తున్నట్లు వివరించింది. దాంతో, 139 రైల్వే సేవలకు అంతరాయం కలగనుందని చెప్పింది.