: సీఎం రెచ్చగొడుతున్నాడు.. బర్తరఫ్ చేయండి: హరీష్ రావు
సీమాంధ్ర ప్రజలను సీఎం రెచ్చగొడుతున్నాడని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఓ సభలో ఆయన మాట్లాడుతూ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తక్షణం ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా జీవోఎంకు నివేదిక ఎలా పంపుతారని ప్రశ్నించారు. అలా నివేదిక పంపడం రాజ్యాంగ విరుద్ధమని సీఎంకు తెలియదా? అని నిలదీశారు. టీకాంగ్ నేతలు సీమాంధ్ర నేతలపై విమర్శలు చేస్తూ రెచ్చగొడుతున్నారని అది సరికాదని ఆయన హితవుపలికారు. విభజనపై ఏనాడు మాట మాట్లాడని బాబు ఇప్పుడు కొబ్బరికాయ సిద్ధాంతం వినిపిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.