: టైమ్ పత్రిక 'పర్సన్ ఆఫ్ ద మూమెంట్'గా సచిన్
ముంబైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తో క్రికెట్ కు గుడ్ బై చెబుతున్న సచిన్ టెండూల్కర్ ను టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద మూమెంట్'గా పేర్కొంది. ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ తన అభిమానులను విచారంలో ముంచుతూ... చివరి మ్యాచ్ ఆడుతున్నాడని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. భారత అత్యుత్తమ క్రికెట్ క్రీడాకారుడైన సచిన్ ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్ మెన్ అని, అంతర్జాతీయ మ్యాచ్ లలో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రీడాకారుడని టైమ్ పత్రిక కొనియాడింది.