: చావెజ్ వారసుడు సత్యసాయి భక్తుడు.. !
వెనిజులా యోధుడు హ్యూగో చావెజ్ మరణంతో ఖాళీ అయిన అధ్యక్ష పదవికి వారసుడిగా ఉపాధ్యక్షుడు నికోలస్ మదురో పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. చావెజ్ కు నమ్మినబంటుగా పేరొందిన మదురో మన పుట్టపర్తి సాయిబాబా భక్తుడట. అందుకు సాక్ష్యంలా మదురో కార్యాలయంలో సత్యసాయి నిలువెత్తు చిత్రపటం అతిథులను పలకరిస్తూ ఉంటుంది.
మదురో 2005లో కుటుంబ సమేతంగా పుట్టపర్తి వచ్చి తన ఆరాధ్య దైవం సత్యసాయిని దర్శించుకున్నారు. వామపక్ష సిద్దాంతాల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న మదురో పూర్వాశ్రమంలో ఓ బస్ డ్రైవర్ గా పనిచేశారు.