: రోహిత్ శర్మ వన్ మ్యాన్ షో.. డీలా పడ్డ విండీస్
భీకర ఫాంలో ఉన్న రోహిత్ శర్మ తానెంత గొప్ప బ్యాట్స్ మెనో మరో సారి తెలియజేశాడు. విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆరో నెంబరు బ్యాట్స్ మెన్ గా క్రీజులోకొచ్చిన రోహిత్ శతకంతో కనువిందు చేశాడు. 117 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ చేశాడు. 99 పరుగుల వద్ద సిక్సర్ బాది శతకాన్ని పూర్తిచేశాడు. దీంతో, తానాడిన రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన ఘనతను రోహిత్ సాధించాడు. చివరి బ్యాట్స్ మెన్ షమీ అండతో రోహిత్ వన్ మ్యాన్ షో నడిపించాడు. ప్రస్తుతం భారత్ 9 వికెట్ల నష్టానికి 479 పరుగులు చేసింది. వీరిద్దరి మధ్య 64 పరుగుల భాగస్వామ్యం నమోదవగా... ఇందులో షమీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు.