: రేపు రాత్రికి తీరం దాటనున్న వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నాగపట్నానికి 420 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు రాత్రికి ఇది మరింత బలపడి, నాగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు రాత్రి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.