: వెనుదిరిగేందుకు సౌదీలో 12వేల మంది తెలుగువారి ఆరాటం
అనుమతులు లేకుండా నివసిస్తున్న విదేశీ కార్మికులను సౌదీ అరేబియా అధికారులు జల్లెడ పడుతున్నారు. దీంతో 12,456 మంది తెలుగువారు అత్యవసర పత్రాల(ఈసీ) కోసం రియాద్ లోని భారత ఎంబసీని సంపద్రించారు. స్వదేశానికి వెళ్లేందుకు ఈసీలు తప్పనిసరి. నతాఖా పేరుతో సౌదీ ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం పరిమితికి మించి, అక్రమంగా ఉంటున్న విదేశీ కార్మికులు సౌదీని వీడాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇచ్చిన గడువు పది రోజుల క్రితమే పూర్తయిపోయింది. దీంతో అక్కడి అధికారులు విస్తృత తనిఖీలు మొదలుపెట్టారు. ఈ చర్యలతో అక్కడి తెలుగువారిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే 7,606 మంది ఈసీలు తీసుకున్నారని భారత ఎంబసీ అధికారులు తెలిపారు.