: అధికారం కోసం కలలు కంటున్నారు: సోనియా గాంధీ
దేశంలో అధికారం కోసం బీజేపీ నేతలు కలలు కంటున్నారని ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ అన్నారు. ఛత్తీస్ గఢ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోనియాగాంధీ మాట్లాడుతూ బీజేపీ నేతలు వాస్తవాలు కప్పిపుచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు.