: రాత్రివేళ కాఫీ తాగుతున్నారా.. ఒక్క నిమిషం ఆగండి


ఘుమఘుమలాడే కాఫీని లొట్టలేసుకుంటూ తాగుతున్నారా.. అదీ సాయంత్రం, రాత్రి వేళల్లోనా.. అయితే ఆగండి. బెడ్ ఎక్కడానికి ఆరు గంటల ముందు కాఫీ తాగినా నిద్రాభంగం తప్పదు సుమీ. ఈ విషయం తాజా అధ్యయనంలో తేలింది. హ్యాపీగా నిద్రించాలని అనుకుంటే సాయంత్రం 5గంటల తర్వాత కాఫీకి దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. నిద్రించే ముందు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగిన వారిలో నిద్రాభంగం అధికంగా ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ కేంద్రం అధ్యక్షుడు సఫ్వాన్ చెప్పారు. ఆరు గంటల ముందు తాగినా గంటపాటు నిద్రా సమయం తగ్గిపోతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.

  • Loading...

More Telugu News