: గుంతకల్ ఎమ్మెల్యేను నిలదీసిన సమైక్యవాదులు
అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూధన్ గుప్తాకు ఈ రోజు సమైక్య సెగ తగిలింది. అనంతపురంలోని ఎస్కే యూనివర్శిటీకి వచ్చిన గుప్తాను ఆ యూనివర్శిటీ జేఏసీ అడ్డుకుంది. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే వాహనం కదలకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనివార్యమని... అందుకే తాము రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చినట్టు తెలిపారు.