: వాంఖడే స్టేడియంలో సచిన్ ఏకైక టెస్ట్ సెంచరీ
సచిన్ తన చివరి టెస్ట్ ఫస్ట్ ఇన్సింగ్స్ లో మంచి అవకాశాన్ని మిస్సయ్యాడు. వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచు మొదటి ఇన్సింగ్స్ లో సచిన్ 74 పరుగులకు పెవిలియన్ దారి పట్టిన విషయం తెలిసిందే. దీంతో 1997లో శ్రీలంక జట్టుపై వాంఖడేలో సచిన్ సాధించిన తొలి టెస్ట్ సెంచరీ (148) రికార్డును తిరగరాసే అవకాశం అతనికి చేజారింది. మరి ఈ టెస్ట్ మ్యాచ్ లో కాలం కలిసి వచ్చి భారత్ కు రెండో ఇన్సింగ్స్ కు అవకాశం లభిస్తే .. సచిన్ చెలరేగి సెంచరీలు బాదితే అది నిజంగా అద్భుతమైన ఫినిషింగ్ టచ్ అవుతుంది. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు.