: జగన్ ను దెబ్బతీసేందుకే విభజన : ఎంపీ మేకపాటి
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తోందని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. జగన్ కు ప్రజల్లో ఉన్న ఆదరణను సోనియాగాంధీ సహించలేకపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆనం సోదరులపై కూడా మేకపాటి విమర్శల వర్షం కురిపించారు. రాజకీయాన్ని వ్యాపారమయం చేసిన ఘనత ఆనం సోదరులదేనని ఎద్దేవాచేశారు.