: ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
భారత్, విండీస్ జట్ల మధ్య జరుగుతున్న ముంబై టెస్టులో 354 పరుగుల వద్ద ఛటేశ్వర్ పుజారా ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. క్రీజులో నిలదొక్కుకున్న పుజారాను షిల్లింగ్ ఫోర్డ్ చక్కని బంతితో బలిగొన్నాడు. దీంతో 113 పరుగులు సాధించిన పుజారా ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. కాగా రోహిత్(24) కు కెప్టెన్ ధోని జత కలిశాడు. భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది.