: మరోసారి సీఎం సమైక్య గళం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్యవాణి వినిపించారు. విశాఖ జిల్లా చోడవరంలోని జడ్పీ స్కూలులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... విభజన వల్ల రాష్ట్రానికి మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం పునఃపరిశీలించాలని కోరారు. విభజన వల్ల సీమాంధ్ర కంటే తెలంగాణకే నష్టం ఎక్కువని సీఎం చెప్పారు. ఎవరి కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారో స్పష్టం చేయాలని ఆయన అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. రెండు ప్రాంతాలకు విభజన వల్ల నష్టం జరగబోతుంటే ఎలా విభజిస్తారని ఆయన నిలదీశారు.