: బీహార్లో పరుగులు పెట్టించిన ఉప్పు
బీహార్ ప్రజలను ఉప్పు ఉరుకులు పరుగులు పెట్టించింది. బీహార్ రాష్ట్రంలో ఉప్పు నిండుకుందని, ఇప్పట్లో ఉప్పు దొరికే పరిస్థితి లేదని రాష్ట్రవ్యాప్తంగా పుకారు షికారు చేసింది. దీంతో అప్రమత్తమైన బీహారీలు షాపుల ముందు క్యూలు కట్టి మరీ ఉప్పును కొనుగోలు చేశారు. అదను చూసిన వ్యాపారులు ఉప్పుకు డిమాండ్ ఉండటంతో కేజీ ఉప్పును 50 నుంచి 70 రూపాయలకు అమ్మారు. దీంతో నివారణ చర్యలకు పూనుకున్న ప్రభుత్వం ఈ పుకారు పుట్టించిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. ఉప్పును అధిక ధరకు కొనుగోలు చేయవద్దని, అది వ్యాపారులు పుట్టించిన పుకారని ప్రతి గ్రామంలో దండోరా వేయించారు.