: బీజేపీలో తన పార్టీని నిమజ్జనం చేయనున్న యడ్యూరప్ప!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నట్లు సమాచారం. నరేంద్ర మోడీని ప్రధానిని చేయడం కోసం తాను స్థాపించిన కర్ణాటక జనతాపార్టీని బీజేపీలో విలీనం చేసి కన్నడనాట 28 ఎంపీ స్థానాలను బీజేపీకి సాధించి పెట్టాలని అనుకుంటున్నారట. ఈ విషయమై యడ్యూరప్ప బీజేపీ అగ్రనేతలను సంప్రదించినట్లు సమాచారం. లోగడ తన పార్టీని బీజేపీలో విలీనం చేసేది లేదని, ఎన్డీయేలో చేరతానని యడ్యూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత(డిసెంబర్ 8) యడ్యూరప్ప కర్ణాటక జనతాపార్టీని బీజేపీలో విలీనం చేయవచ్చని భావిస్తున్నారు.