: సెహ్వాగ్ పై వేటు.. ఆసీస్ తో చివరి రెండు టెస్టులకు జట్టు ప్రకటన


ఊహించిందే జరిగింది! వరుసగా విఫలమవుతూ జట్టులో స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్న ఓపెనర్ సెహ్వాగ్ పై వేటు పడింది. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన భారత సెలెక్టర్లు సెహ్వాగ్ కు చోటు కల్పించలేదు. ఆసీస్ తో తొలి రెండు టెస్టుల్లో పేలవ ఫామ్ కనబర్చిన సెహ్వాగ్ ఆ మ్యాచ్ ల్లో 2, 19, 6 స్కోర్లు నమోదు చేశాడు.

అన్నివైపుల నుంచి వీరూ విషయమై ఒత్తిళ్లు పెరిగిపోవడంతో సెలెక్టర్లకు అతన్ని తొలగించక తప్పిందికాదు. కాగా, వీరూ స్థానంలో మరెవర్నీఎంపిక చేయలేదు. తొలి రెండు టెస్టుల్లో ఆడిన జట్టులో వీరూను తొలగించడం తప్ప మరేమీ మార్పులేదు. జట్టు: ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), విజయ్, పుజారా, సచిన్, కోహ్లీ, ధావన్, రహానే, జడేజా, అశ్విన్, ఓజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హర్భజన్, అశోక్ దిండా

  • Loading...

More Telugu News