: నిజజీవితంలో సల్మాన్, కత్రినా ఒక్కటవ్వాలి: అమీర్ ఖాన్
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మాజీ ప్రియులు. వీరిద్దరూ నిజజీవితంలో ఒక్కటైతే చూడాలని కోరుకుంటున్నట్లు బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో అమీర్ ఖాన్ సంచలనానికి తెరలేపారు. కత్రినా కైఫ్ పక్కన ఉన్నప్పుడే అమీర్ ఈ విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. 'వారు ఒక్కటైతే చూడాలని ఉంది. కానీ నా ఆలోచనలు కష్టమే' అని అమీర్ అన్నారు. దీనికి కత్రినా స్పందిస్తూ.. 'నేను మాట్లాడలేను. ఏదో చెప్పాలని అనుకుంటున్నాను' అంటూ కత్రినా అసలు విషయాన్ని దాటేసింది.