: 5.5% వృద్ధిపై చిదంబరం విశ్వాసం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి 5 నుంచి 5.5 శాతం మధ్య ఉండగలదని కేంద్ర మంత్రి చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను 8 శాతం వృద్ధి దిశగా నడిపించగలవన్నారు. బాంకాన్ 2013 సదస్సులో బ్యాంకర్లు, ఆర్థిక వేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉద్దేశపూర్వక రుణాల ఎగవేతదారులతో సరిగా వ్యవహరించాలని (వసూలు కోసం) సూచించారు. ద్రవ్యోల్బణం ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగడం ప్రభుత్వానికి ఒక సవాలుగా పేర్కొన్నారు.