: రాష్టానికి 11 ఏకలవ్య గురుకుల పాఠాశాలలు
ఈ ఉదయం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్టానికి 11 ఏకలవ్య గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రతాప్ గఢ్ లో జరిగిన డీఎస్పీ హత్య కేసును సీబీఐకి అప్పగించింది. అంతేకాకుండా పౌరులకు కాలపరిమితితో కూడిన సేవల బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.