: ఫిబ్రవరి 6 నుంచి గుంటూరు జిల్లాలో బాబు పాదయాత్ర
'వస్తున్నా-మీకోసం' పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 6న గుంటూరు జిల్లాలో ప్రవేశించనున్నారు. ఆ జిల్లాలో 12 నుంచి 15 రోజుల పాటు చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పాదయాత్ర సమన్వయ కర్త కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. 124 రోజులుగా సాగుతున్న చంద్రబాబు పాదయాత్ర 1,925 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని ఆయన చెప్పారు.
ఇప్పటి వరకు 12 జిల్లాల్లోని, 17 పురపాలక సంఘాలు, 843 గ్రామాల్లో పాదయాత్ర పూర్తయిందని కంభంపాటి అన్నారు. చంద్రబాబు పాదయాత్ర గుంటూరు జిల్లాలో రెండు వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకునే సందర్భంగా భారీ స్తూపం నిర్మించనున్నట్లు జిల్లా నేతలు తెలిపారు.